పాతికేళ్ళ తర్వాత విడుదలైన మోహన్ లాల్ మొదటి సినిమా... ఎందుకో తెలుసా?
Published by: Satya Pulagam
Image Source: @mohanlal
మోహన్ లాల్ మొదటి సినిమా Thiranottam. ఆ సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఆయన వయసు 18 ఏళ్ళు.
Image Source: @mohanlal
Thiranottam షూటింగ్ పూర్తయినా సెన్సార్ సమస్యల కారణంగా వెంటనే విడుదల కాలేదు.
Image Source: @mohanlal
సుమారు 25 సంవత్సరాల తర్వాత Thiranottam విడుదలైంది. అదీ కేరళలోని ఓ థియేటర్ లో విడుదల చేశారు.
Image Source: @mohanlal
Thiranottam సినిమాలో మానసిక వికలాంగుడు కుట్టప్పన్ పాత్రలో మోహన్ లాల్ నటించారు
Image Source: @mohanlal
Thiranottam మోహన్ లాల్ డెబ్యూ ఫిల్మ్ అయినప్పటికీ... రిలీజ్ ఆలస్యం కావడంతో Manjil Virinja Pookkal మొదట విడుదలైంది.
Image Source: @mohanlal
మలయాళ చిత్రసీమలో మొదలైన మోహన్ లాల్ ప్రయాణం... ఇతర భాషల్లోకి కూడా వెళ్ళింది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
Image Source: @mohanlal
మలయాళ సినిమాలు చేస్తూ మధ్యలో వేరే భాషల సినిమాలు చేస్తున్నారు మోహన్ లాల్. మలయాళ పరిశ్రమ మంచి గుర్తింపును ఇస్తున్నప్పుడు, వేరే చోటికి ఎందుకు వెళ్ళాలని ఓ సందర్భంలో ఆయన అన్నారు.
Image Source: @mohanlal
తెలుగులో 'జనతా గ్యారేజ్' వంటి సినిమాల్లోనూ మోహన్ లాల్ నటించారు.
Image Source: @mohanlal
ఇప్పుడు మోహన్ లాల్ మలయాళ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు.