నిఫ్టీ 99 పాయింట్లు పెరిగి 18,598 వద్ద క్లోజైంది. సెన్సెక్స్ 344 పాయింట్లు ఎగిసి 62,846 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 293 పాయింట్లు పెరిగి 44,311 వద్ద స్థిరపడింది. ఎంఅండ్‌ఎం, టైటాన్, కోల్ ఇండియా, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సెమ్ షేర్లు లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, దివిస్ ల్యాబ్, పవర్ గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే 82.63 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.60,600గా ఉంది. కిలో వెండి రూ.73,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.90 పెరిగి రూ.27,240 వద్ద ఉంది. బిట్‌కాయిన్ 2.79 శాతం పెరిగి రూ.23.10 లక్షల వద్ద కొనసాగుతోంది