ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 129 పాయింట్లు పెరిగి 17,080 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 346 పాయింట్లు పెరిగి 57,960 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 342 పాయింట్లు పెరిగి 39,910 వద్ద స్థిరపడింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హీరోమోటో కార్ప్, ఐచర్ మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభపడ్డాయి. యూపీఎల్, భారతీ ఎయిర్‌టెల్, ఏసియన్ పెయింట్స్, రిలయన్స్, సిప్లా షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 16 పైసలు బలహీనపడి రూ.82.35 వద్ద స్థిరపడింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.59,670 గా ఉంది. కిలో వెండి రూ.73,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.370 తగ్గి రూ.25,350 వద్ద ఉంది. బిట్‌కాయిన్ (Bitcoin) 4.20 శాతం పెరిగి రూ.23.13 లక్షల వద్ద కొనసాగుతోంది.