నిఫ్టీ 13 పాయింట్లు తగ్గి 19,646 వద్ద క్లోజైంది. సెన్సెక్స్ 106 పాయింట్లు పతనమై 66,160 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 211 పాయింట్లు తగ్గి 45,468 వద్ద ముగిసింది. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బీపీసీఎల్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 31 పైసలు బలహీనపడి 81.94 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.60,110 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.2000 తగ్గి రూ.76400 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.730 తగ్గి రూ.24,790 వద్ద కొనసాగుతోంది. బిట్‌కాయిన్ రూ.24.02 లక్షల వద్ద ఉంది.