నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 19,306 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 110 పాయింట్లు పెరిగి 65,996 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 263 పాయింట్లు పెరిగి 44,494 వద్ద స్థిరపడింది. పవర్ గ్రిడ్, ఎల్‌టీ, సిప్లా, ఎం అండ్ ఎం, బీపీసీఎల్ షేర్లు లాభపడ్డాయి. జియో ఫైనాన్స్, రిలయన్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, హిందాల్కో, నెస్లే ఇండియా నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.62 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.50 తగ్గి రూ.59,400 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.76,900 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.60 తగ్గి రూ.25,080 వద్ద ఉంది. బిట్ కాయిన్ ₹ 21,42,600 వద్ద ఉంది.