నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 18,268 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 98 పాయింట్లు తగ్గి 61,872 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 3 పాయింట్లు పెరిగి 43,681 వద్ద స్థిరపడింది. భారతీ ఎయిర్‌టెల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఆటో, ఐటీసీ, దివిస్ ల్యాబ్ షేర్లు లాభపడ్డాయి. విప్రో, టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యూపీఎల్, హిందాల్కో షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.74 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.490 తగ్గి రూ.60,870గా ఉంది. కిలో వెండి రూ.100 తగ్గి రూ.73,050 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.740 తగ్గి రూ.27,220 వద్ద కొనసాగుతోంది. బిట్‌కాయిన్ రూ.21.71 లక్షల వద్ద ఉంది.