నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 18,348 వద్ద క్లోజైంది. సెన్సెక్స్ 18 పాయింట్లు పెరిగి 61,981 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 69 పాయింట్లు పెరిగి 43,954 వద్ద ముగిసింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, దివిస్ ల్యాబ్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐచర్ మోటార్స్, యూపీఎల్ షేర్లు లాభపడ్డాయి. అపోలో హాస్పిటల్స్, హెచ్‌సీఎల్ టెక్, గ్రాసిమ్, టెక్ మహీంద్రా, కొటక్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసల బలపడి 82.79 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.310 తగ్గి రూ.61,100గా ఉంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.74,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.210 పెరిగి రూ.28,450 వద్ద కొనసాగుతోంది. బిట్‌కాయిన్ రూ.22.61 లక్షల వద్ద ఉంది.