ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 5 పాయింట్లు పెరిగి 17,624 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 64 పాయింట్లు పెరిగి 59,632 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 115 పాయింట్లు పెరిగి 42,269 వద్ద స్థిరపడింది. అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, ఏసియన్ పెయింట్స్ లాభపడ్డాయి. దివిస్ ల్యాబ్, ఐచర్ మోటార్స్, హిందుస్థాన్ యునీలివర్, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు పెరిగి 82.15 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.220 తగ్గి రూ.60,930గా ఉంది. కిలో వెండి రూ.200 తగ్గి రూ.77,400 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.320 పెరిగి రూ.28,740 వద్ద ఉంది. బిట్‌కాయిన్ 1.31% తగ్గి రూ.23.69 వద్ద ఉంది.