నిఫ్టీ 104 పాయింట్లు తగ్గి 18,181 వద్ద క్లోజైంది. సెన్సెక్స్ 377 పాయింట్లు తగ్గి 61,560 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 205 పాయింట్లు తగ్గి 43,698 వద్ద క్లోజైంది. హీరో మోటోకార్ప్, ఐటీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యూపీఎల్, భారతీ ఎయిర్‌టెల్ లాభపడ్డాయి. హెచ్‌సీఎల్ టెక్, కొటక్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఎస్‌బీఐ లైఫ్, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. రూపాయి 18 పైసలు బలహీనపడి 82.39 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.490 తగ్గి రూ.61,420గా ఉంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.74,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.30 పెరిగి రూ.28,170 వద్ద ఉంది. బిట్‌కాయిన్ 0.62 శాతం తగ్గి రూ.22.22 లక్షల వద్ద కొనసాగుతోంది.