ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 114 పాయింట్లు పెరిగి 17,100 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 355 పాయింట్లు ఎగిసి 57,989 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 465 పాయింట్లు పెరిగి 39,598 వద్ద స్థిరపడింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హిందాల్కో, అల్ట్రాటెక్ సెమ్, యూపీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభపడ్డాయి. ఐచర్ మోటార్స్, ఎన్‌టీపీసీ, మారుతీ, ఐటీసీ, పవర్ గ్రిడ్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు బలపడి 82.71 వద్ద స్థిరపడింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.270 పెరిగి రూ.58,690 గా ఉంది. కిలో వెండి రూ.600 పెరిగి రూ.69,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.530 పెరిగి రూ.26,030 వద్ద ఉంది. బిట్ కాయిన్ 6.6 శాతం పెరిగి రూ.22.44L వద్ద ఉంది.