ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 121 పాయింట్లు తగ్గి 17,706 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 520 పాయింట్లు తగ్గి 59,910 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 130 పాయింట్లు పెరిగి 42,262 వద్ద క్లోజైంది. నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్, ఎస్‌బీఐ, బ్రిటానియా, కోల్ ఇండియా షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫీ, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఎల్‌టీ, ఎన్‌టీపీసీ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 12 పైసలు బలహీనపడి 81.97 వద్ద స్థిరపడింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.61,030గా ఉంది. కిలో వెండి రూ.78,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.190 తగ్గి రూ.27,330 వద్ద ఉంది. బిట్‌కాయిన్ 1.22 శాతం తగ్గి రూ.24.52 లక్షల వద్ద కొనసాగుతోంది.