నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 17,828 వద్ద ఉంది. సెన్సెక్స్ 38 పాయింట్లు ఎగిసి 60,431 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 574 పాయింట్లు పెరిగి 42,132 వద్ద క్లోజైంది. ఇండస్ ఇండ్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఐచర్ మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, పవర్ గ్రిడ్ షేర్లు లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫీ, హెచ్‌సీఎల్ టెక్, ఎన్టీపీసీ, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 13 పైసలు బలపడి 81.82 వద్ద స్థిరపడింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.61,200గా ఉంది. కిలో వెండి రూ.650 పెరిగి రూ.78,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.470 పెరిగి రూ.26,860 వద్ద ఉంది. బిట్‌కాయిన్ 1.20 శాతం పెరిగి రూ.24.90 లక్షల వద్ద ఉంది.