నిఫ్టీ 114 పాయింట్లు తగ్గి 19,428 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 365 పాయింట్లు తగ్గి 65,322 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 342 పాయింట్లు తగ్గి 44,199 వద్ద స్థిరపడింది. హెచ్‌సీఎల్ టెక్, టైటాన్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సెమ్ షేర్లు లాభపడ్డాయి. ఎస్బీఐ లైఫ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, యూపీఎల్, టాటా కన్జూమర్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 14 పైసలు బలహీనపడి రూ.82.85 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.270 తగ్గి రూ.57,800 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.76200 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.630 పెరిగి రూ.24,300 వద్ద ఉంది. బిట్‌కాయిన్ రూ.24.31 లక్షల వద్ద ఉంది.