ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 24 పాయింట్లు పెరిగి 17,624 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 13 పాయింట్లు పెరిగి 59,846 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 206 పాయింట్లు తగ్గి 40,834 వద్ద ముగిసింది. టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, గ్రాసిమ్, విప్రో షేర్లు టాప్ గెయినర్స్ ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్జూమర్, హిందుస్థాన్ యునీలివర్, ఇండస్ ఇండ్ బ్యాంకు టాప్ లాసర్స్ డాలర్‌తో పోలిస్తే రూపాయి ఒక పైసా బలహీనపడి 81.89 వద్ద స్థిరపడింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.430 తగ్గి రూ.60,430గా ఉంది. కిలో వెండి రూ.300 తగ్గి రూ.76,300 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.26,410 వద్ద ఉంది. బిట్‌కాయిన్ 1.47 శాతం పెరిగి రూ.23.19 లక్షల వద్ద కొనసాగుతోంది.