నిఫ్టీ 116 పాయింట్లు పెరిగి 19,727 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 385 పాయింట్లు పెరిగి 66,265 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 469 పాయింట్లు ఎగిసి 44,878 వద్ద ముగిసింది. కోల్ ఇండియా (6.92%), ఎల్‌టీ (4.24%), ఇండస్‌ఇండ్ బ్యాంక్ (2.08%), ఎస్బీఐ లైఫ్ (1.80%), ఎస్బీఐ (1.77%) షేర్లు లాభపడ్డాయి. టాటా కన్జూమర్ (2.27%), ఓఎన్జీసీ (0.98%), బ్రిటానియా (0.90%), ఎం అండ్ ఎం (0.77%), సన్‌ఫార్మా (0.732%) షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసల బలహీనపడి 83.21 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.110 పెరిగి రూ.59,890 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.700 తగ్గి రూ.74,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.290 తగ్గి రూ.24,350 వద్ద ఉంది. బిట్ కాయిన్ ₹ 21,40,943 వద్ద ఉంది.