నిఫ్టీ 165 పాయింట్లు తగ్గి 19,331 వద్ద క్లోజైంది. సెన్సెక్స్ 505 పాయింట్లు తగ్గి 65,280 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 414 పాయింట్లు తగ్గి 44,925 వద్ద స్థిరపడింది. టాటా మోటార్స్, టైటాన్, ఎం అండ్ ఎం, ఎస్బీఐ లైఫ్, సిప్లా షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, అపోలో హాస్పిటల్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు తగ్గాయి. డాలర్‌తో పోలిస్తే 23 పైసలు బలహీనపడి 82.74 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.90 తగ్గి రూ.59,070గా ఉంది. కిలో వెండి రూ.700 తగ్గి రూ.72,300 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.320 తగ్గి రూ.23,240 వద్ద ఉంది. బిట్‌కాయిన్ 2.94 శాతం తగ్గి 24.92 లక్షల వద్ద ఉంది.