నిఫ్టీ 93 పాయింట్లు పెరిగి 19,528 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 240 పాయింట్లు పెరిగి 65,628 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 142 పాయింట్లు పెరిగి 44,578 వద్ద ముగిసింది. కోల్ ఇండియా, విప్రో, అల్ట్రాటెక్ సెమ్, హెచ్‌సీఎల్ టెక్, జియో ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, నెస్లే ఇండియా, ఐటీసీ, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు బలహీనపడి 82.75 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.60,320 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.76,900 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.50 పెరిగి రూ.25,600 వద్ద ఉంది. బిట్ కాయిన్ ₹ 21,44,474 వద్ద కొనసాగుతోంది.