నిఫ్టీ 181 పాయింట్లు పెరిగి 19,435 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 555 పాయింట్లు పెరిగి 65,387 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 446 పాయింట్ల లాభంతో 44,436 వద్ద ముగిసింది. జియోఫిన్, ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభపడ్డాయి. సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, డాక్టర్ రెడ్డీస్, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సెమ్ షేర్లు తగ్గాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు బలపడి 82.71 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.60,050 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.77,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.140 తగ్గి రూ.25,790 వద్ద ఉంది. బిట్‌కాయిన్ 4.33 శాతం తగ్గి రూ.21.51 లక్షల వద్ద కొనసాగుతోంది.