ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 146 పాయింట్లు పెరిగి 17,450 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 448 పాయింట్లు ఎగిసి 59,411 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 429 పాయింట్లు పెరిగి 40,698 వద్ద స్థిరపడింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, హిందాల్కో, యూపీఎల్, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్ షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్, బ్రిటానియా, సిప్లా, బీపీసీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 16 పైసలు లాభపడి 82.50 వద్ద స్థిరపడింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.170 పెరిగి రూ.56,290 గా ఉంది. కిలో వెండి రూ.66,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.25,410 వద్ద ఉంది. బిట్‌కాయిన్ (Bitcoin) 1.37 శాతం పెరిగి రూ.19.61 లక్షల వద్ద కొనసాగుతోంది.