అమూల్ సంస్థ పాల వినియోగదారులకు తెల్లవారుజామునే భారీ షాకిచ్చింది. ఒక లీటరుపై రూ.2 చొప్పున పెంచుతూ GCMMF నిర్ణయం తీసుకుంది అమూల్ ఆవు పాలు అర్ధ లీటర్ ధర రూ.29, లీటర్ రూ.57కి పెరిగింది. అమూల్ గోల్డ్ పాలు లీటర్ ధర రూ.66 నుంచి రూ.68 కాగా, ఆఫ్ లీటర్ రూ.34 అయింది సాగర్ స్కిమ్మిడ్ పాలు లీటర్ ధర రూ.40, ఆఫ్ లీటర్ రూ.20 వద్ద స్థిరంగా అమూల్ గేదె పాల ధర లీటరుకు రూ.73కి చేరగా, ఆఫ్ లీటర్ రూ.37 అయింది అమూల్ స్లిమ్ అండ్ ట్రిమ్ లీటర్ పౌచ్ రూ.49, అర్ధ లీటర్ రూ.25కి చేరింది అమూల్ తాజా పాలు ఆఫ్ లీటర్ రూ.28, లీటర్ ధర రూ.58కి పెరిగింది అమూల్ శక్తి లీటరుకు రూ.60కి, అర్ధ లీటర్ ధర రూ.30 అయింది అమూల్ టీ స్పెషల్ పాలు గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ లలో మాత్రమే లభ్యం