50KM కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే హోండా టూవీలర్స్ ఇవే!

Published by: Khagesh

మీ మైలేజ్ అవసరాలకు సరిపోయే వివిధ మోడల్స్ ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

హోండా మోడళ్లు కోసమే చూస్తున్నట్టేతే దాదాపు 8 వరకు మోడల్స్‌ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి.

హోండా లివో అత్యంత ఇంధన సామర్థ్యం గల వాహనంగా చెలామణి అవుతోంది.

Published by: Khagesh

హోండా లివో 70 kmpl మైలేజీని ఇస్తుందని సంస్థ పేర్కొంది. దీని మార్కెట్ ప్రైస్‌ 80,081 రూపాయలు.

ఈ జాబితాలో 65కిలోమీటర్ల మైలేజీతో హోండా షైన్ 100 డీఎక్స్ రెండో స్థానంలో ఉంది. దీని మార్కెట్ ప్రైస్‌ 71,896 రూపాయాలు.

మూడో స్థానంలో హోండా ఎస్పీ 125 ఉంది. దీని మార్కెట్ ప్రైస్‌ 88,528 రూపాయలు.

నాల్గో స్థానంలో హోండా యాక్టివా ఉంది. ఇది 59.5 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని ధర 75,583 నుంచి ప్రారంభమవుతుంది.

57 కిలోమీటర్లతో హోండా హార్నెట్‌ 2.0 ఐదో స్థానంలో ఉంది. దీని ధర లక్షన్నరకుపైగా ఉంది.

55కిలోమీటర్లతో ఆరో స్థానంలో ఉంది హోండా షైన్‌. ఇది 81,502 రూపాయలకే వస్తుంది.

తర్వాత స్థానంలో హోండా షైన్ 100 ఉంది. 55 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఈ వాహనం ధర 65,393 నుంచి మొదలవుతుంది.

50 కిలోమీటర్ల మైలేజ్‌తో హోండా యూనికాన్, హోండా డియో, హోండా ఎస్పీ 160 కూడా 50 KMPL మైలేజీ ఇస్తున్నాయి.