Hero Splendor Plus Flex Fuel హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర ఎంత?

Published by: Khagesh

దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కమ్యూటర్ మోటార్ సైకిల్ హీరో స్ప్లెండర్

ఇప్పుడు సరికొత్త విప్లవాత్మక సాంకేతికతతో మార్కెట్లోకి అడుగుపెట్టింది.

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ విడుదలైంది.

హైదరాబాద్‌లో ఈ సరికొత్త బైక్ ఆన్‌రోడ్ ధర ఎంత ఉంది?

స్ప్లెండర్ ప్లస్‌తో పోలిస్తే ఇది సుమారు ₹5,000 వరకు ఎక్కువ ధర కలిగి ఉంది.

హైదరాబాద్‌లో ఎక్స్-షోరూమ్ ధర ₹82,810, హైదరాబాద్ ఆన్‌రోడ్ ధర ₹92,000 - ₹1,00,434

ఈ సరికొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ అధిక శాతంలో ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించుకోగలదు.

ఇథనాల్ మిశ్రమానికి తట్టుకునేలా ఫ్యూయల్ పంప్, ఎయిర్ ఫిల్టర్, ఈసీయూ సిస్టమ్‌ను ప్రత్యేకంగా రీ-డిజైన్ చేసింది.

పెరిగిపోతున్న పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందాలని చూస్తున్న మిడిల్ క్లాస్ వాహనదారులకు, హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఒక మంచి ఆప్షన్.