భారత్‌లో మొదటిసారిగా బ్లడ్ డొనేట్ చేసిందెవరు?

Published by: Khagesh

భారత్‌లో మొదటిసారిగా ఒక నిర్దిష్ట వ్యక్తి పేరుతో కాకుండా, ఒక సామూహిక హ్యుమానిటేరియన్ ఉద్యమంగా రక్తదానం ప్రారంభమైంది.

Published by: Khagesh

1942లో దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగులు, ఆంగ్లో- ఇండియన్‌ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భారత్‌లో తొలిసారిగా రక్తదానం చేశారు

Published by: Khagesh

ఆ సమయంలో జరుగుతున్న రెండో ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా గాయపడిన సైనికుల ప్రాణాలను కాపాడటం కోసం ఈ రక్తదాన ప్రక్రియను భారత్‌లో అధికారికంగా ప్రారంభించారు.

Published by: Khagesh

రక్తదానాన్ని క్రమబద్ధీకరించడానికి 1942 మార్చిలో కోల్‌కతాలో భారత్‌లో మొదటి బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేశారు.

Published by: Khagesh

కోల్‌కతాలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైజీన్ అండ్ పబ్లిక్‌ హెల్త్ భవనంలో తొలి బ్లడ్ బ్యాంకు ఏర్పాటైంది.

Published by: Khagesh

ఈ మొదటి బ్లడ్ బ్యాంక్ నిర్వహణ బాధ్యతలను ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ బెంగాల్‌ బ్రాంచ్ విజయవంతంగా చూసుకుంది.

Published by: Khagesh

భారత్‌లో బ్లడ్ బ్యాంకింగ్ వ్యవస్థ పునాదుల వెనుక డాక్టర్‌ శివదేవ్‌ సింగ్ గ్రెవాల్ వంటి వైద్యుల కృషి ఉంది.

Published by: Khagesh

పెయిడ్‌ డోనర్స్ పద్దతిని మార్చడానికి లీలా మూల్గావ్కర్‌ 1954లో ముంబైలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాలను ప్రారంభించారు.

Published by: Khagesh

భారత్‌లో రక్తదాన ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉద్ధృతంగా చేసిన డాక్టర్‌ జేజీ జాలీని భారత రక్తమార్పిడి వైద్య పితామహుడిగా పిలుస్తారు.

Published by: Khagesh

డాక్టర్ జేజి జాలీ చొరవతోనే అక్టోబర్ 1న జాతీయ రక్తదాన దినోత్సవంగా జరుపుకుంటారు.

Published by: Khagesh

1998 జనవరి 1 నుంచి భారత్‌లో రక్తం కొనడం, అమ్మడం పూర్తిగా నిషేధం.

Published by: Khagesh