కారు టైర్లలో చిన్న రాళ్లు ఇరుక్కుంటే ఇంత ప్రమాదకరమా..

Published by: Shankar Dukanam
Image Source: pexels

కారు నడుపుతున్నప్పుడు సాధారణంగా టైర్లలో చిన్న రాళ్లు ఇరుక్కుపోవడం గమనిస్తుంటాం

Image Source: pexels

మీరు చిన్నదిగా భావిస్తున్న రాయి, క్రమంగా మీ కారుతో పాటు మీ ప్రాణానికి సైతం ప్రమాదకరంగా మారవచ్చు

Image Source: pexels

కారు టైర్లలో ఇరుక్కున్న చిన్న రాళ్లు చూడటానికి చిన్నవిగా అనిపించినా చాలా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి

Image Source: pexels

టైర్ రబ్బరు కోతకు గురవుతుంది. ప్రతి వీల్‌లో మొనదేలిన రాయి టైర్ లోపలి రబ్బరును నెమ్మదిగా కోస్తుంది.

Image Source: pexels

రాయి తగలడం వల్ల టైర్లో చిన్న రంధ్రం ఏర్పడుతుంది. దాంతో టైర్ నుంచి గాలి ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా బయటకు పోతుంది.

Image Source: pexels

వేసవిలో టైర్ ముందే వేడిగా ఉంటుంది. రాళ్ల రాపిడి వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివల్ల బ్లోఔట్ ప్రమాదం పెరుగుతుంది.

Image Source: pexels

ఒక వైపున రాయి ఇరుక్కుపోవడం వల్ల టైరు బరువు బ్యాలెన్స్ కోల్పోతుంది. దీనివల్ల కారు ఒక వైపుకు లాగినట్లు అవుతుంది.

Image Source: pexels

అధిక వేగంతో ఇది చాలా ప్రమాదకరం. కారు 80-100 kmh వేగంతో వెళుతుంటే సమస్య పెరిగే అవకాశం ఉంది.

Image Source: pexels

వేగంగా వెళ్తున్న కారు టైరులో ఇరుక్కున్న రాయి ఊడిపోయి, మరో వాహనం అద్దాలు పగలగొట్టవచ్చు.

Image Source: pexels

ఇంటి నుండి బయలుదేరే ముందు మీ కారు టైర్లలో సరైన ప్రెజర్ ఉందో లేదో చెక్ చేయాలి.

Image Source: pexels