అసుస్ ఫోల్డబుల్ ల్యాప్‌టాప్ జెన్‌బుక్ 17 ఫోల్డ్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 17.3 అంగుళాల ఫోల్డబుల్ ఓఎల్ఈడీ టచ్‌స్క్రీన్‌ను అందించారు. గతేడాది లెనోవో థింక్ ప్యాడ్ ఎక్స్1 ఫోల్డ్ కూడా ఇటువంటి డిస్‌ప్లేతోనే మనదేశంలో లాంచ్ అయింది. దీని ధరను మనదేశంలో రూ.3,29,990గా నిర్ణయించారు. అసుస్ ఈ-షాప్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా స్టోర్ల ద్వారా దీన్ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇక ఆఫ్‌లైన్‌లో అసుస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, రోగ్ స్టోర్లు, అప్రూవ్డ్ డీలర్ల వద్ద ఉండనుంది. దీని డిస్‌ప్లే సైజు ఫోల్డ్ చేసినప్పుడు 12.5 అంగుళాలకు తగ్గనుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 75Whr బ్యాటరీని అందించారు. దీన్ని పూర్తిగా చార్జ్ చేశాక ఫోల్డ్ చేసి ఉపయోగిస్తే 9.5 గంటలు, మామూలుగా ఉపయోగిస్తే 8.5 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 12వ తరం ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌ను అందించారు.