మేషం to మీనం

ఏప్రిల్ 2025 ఎవరికి బావుంది, ఎవరికి బాలేదు!

Published by: RAMA

మేష రాశి

ఏప్రిల్ అనుకూలంగాలేదు. ఉద్యోగం, వ్యాపారం, వృత్తిలో ఇబ్బందులు తప్పవు. ఊహించని సంఘటనలు, ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.

వృషభ రాశి

ఏప్రిల్ లో మొదటి రెండు వారాలు ఆర్థికంగా అనూకూలం, ఆనందం...చివరి రెండు వారాలు అనారోగ్య సమస్యలు

మిథున రాశి

ఈ నెలలో మీకు పట్టిందల్లా బంగారమే. అలా అనుకుంటే అలా పనులు పూర్తవుతాయి. శత్రువులు స్నేహితులు అవుతారు. అన్నింటా మీదే పైచేయి

కర్కాటక రాశి

గడిచిన నెలకన్నా ఏప్రిల్లో ఉపశమనం. ఉద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారంలో లాభాలుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది

సింహ రాశి

ఈ నెలలో మీకు అనుకూల ఫలితాలు లేవు. అడుగుకో అడ్డంకి తప్పదు. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త

కన్యా రాశి

ఏప్రిల్ నెల ఆర్థికంగా అనుకూలమే కానీ..అనుకోని ప్రమాదాలు ఎదురవుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది

తులా రాశి

ఆదాయం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అంతకుమించిన ఖర్చులుంటాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ముందుకి సాగుతారు

వృశ్చిక రాశి

ఈ నెల మీకు అద్భుతం. అడుగుపెట్టిన ప్రతిచోటా విజయం, ఆనందం. ఆర్థికంగా లాభపడతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహణకు ప్లాన్ చేసుకుంటారు

ధనస్సు రాశి

ఉద్యోగం, వృత్తి, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు ప్రమోషన్ సంబంధిత సమాచారం వింటారు

మకర రాశి

మంచి రోజులు మొదలవుతున్నాయనే సూచన ఏప్రిల్ మీకు. ఏడున్నరేళ్ల ఏల్నాటి శని నుంచి పూర్తి ఉపశమనం లభిస్తుంది..అన్నీ మంచి రోజులే

కుంభ రాశి

ఏప్రిల్ నెల మీకు ప్రశాంతమైన సమయం. ఆదాయం పెరుగుతుంది, వృత్తి ఉద్యోగాల్లో శుభ ఫలితాలు పొందుతారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు

మీన రాశి

కొత్త ఏడాదిలో మీ కష్టాలకు ఏప్రిల్ మీకు వెల్కమ్ చెబుతున్నట్టు ఉంటుంది. విరోధాలు, వాహనప్రమాదాలు, చికాకులు ఉంటాయి. నెల చివరివారం కొంత ఉపశమనం