ఈసారి లాంచ్ అయ్యే ఫోన్లలో ఐఫోన్ మినీ వెర్షన్ రావట్లేదు.

2019లో యాపిల్ మొదటిసారి మినీ వెర్షన్ లాంచ్ చేసింది. ఇప్పుడు దాన్ని డిస్‌కంటిన్యూ చేశారు.

మొట్టమొదటిసారి వేర్వేరు మోడళ్లలో వేర్వేరు ప్రాసెసర్లు ఉండనున్నాయి.

ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్‌ల్లో ఏ15, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లో ఏ16 బయోనిక్ చిప్ ఉండనున్నాయి.

ఐఫోన్ 14 సిరీస్ మోడళ్లలో ధర కొంచెం పెరగనుంది.

కానీ ప్రారంభ ధర మాత్రం ఐఫోన్ 13 మోడల్స్ తరహాలోనే ఉండనుంది.

ఐదు సంవత్సరాల తర్వాత ఐఫోన్ 14లో డిజైన్ మార్చనున్నారు.

ఐఫోన్ X తర్వాత యాపిల్ ఇందులోనే డిజైన్ ఛేంజ్ చేయనుంది.

2015 తర్వాత యాపిల్ కెమెరాలను అప్‌గ్రేడ్ చేయనుంది.

ఐఫోన్ 14 ప్రో సిరీస్‌లో 48 మెగాపిక్సెల్ కెమెరా అందించనున్నట్లు తెలుస్తోంది.