బుల్లితెరకు గ్లామర్‌ను పరిచయం చేసింది అనసూయ భరద్వాజ్. ఈమె తరువాత చాలా మంది యాంకర్లు ఎక్స్ పోజింగ్ చేయడం మొదలుపెట్టారు. ఎంతమంది అనసూయకి పోటీ వచ్చినా ఆమె స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. ‘జబర్దస్త్’తో మాంజి ఫాలోయింగ్ తెచ్చుకున్న అను ప్రస్తుతం సినిమాల్లో బిజీగా మారింది. తాజాగా మూడు కొత్త సినిమాలకు అనసూయ సైన్ చేసింది. నటిగా బిజీ అవ్వడంతో బుల్లితెరకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. తాజాగా ‘జబర్దస్త్’ షోకి గుడ్ బై చెబుతూ ఓ పోస్ట్ పెట్టి అభిమానులకు షాకిచ్చింది. సోషల్ మీడియాలో మాత్రం అనసూయ యాక్టీవ్‌గానే ఉంటోంది. ఏమైందో ఏమో.. తాజాగా ఆమె ‘అనసూయ’ అంటే ‘అసూయ’ తెలియనిదని పోస్ట్ పేర్కొంది. అనసూయ తన పెట్స్, పిల్లతో ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. పెట్స్‌తో అనసూయ టైమ్ పాస్. కాస్త బ్రేక్ దొరకడంతో అనసూయ ఇంట్లో ఇలా పిల్లలతో చిల్ అవుతూ కనిపించింది. Credits: Anasuya Bharadwaj