అల్లం తీసుకోవడం వల్ల కలిగే అద్బుతమైన ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.



ఎలాంటి జీర్ణ సమస్యలకైనా అల్లం అద్బుతంగా పని చేస్తుంది.



అజీర్ణం, గ్యాస్, కడుపులో మంట, కడుపు ఉబ్బరం, అల్సర్లు వంటి అనేక సమస్యలకు అల్లం అద్బుతంగా పనిచేస్తుంది.



దంత సమస్యలు, నోటి దుర్వాసనకు అల్లం పొడి పేస్టు మంచి మెడిసిన్ గా పనిచేస్తుంది.



సీజనల్ గా వచ్చే వ్యాధులను తగ్గించేందుకు కూడా అల్లం బాగా పని చేస్తుంది.



అల్లంలో సహజసిద్ధమైన యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.



కీళ్ల నొప్పులు ఉన్నవారికి అల్లం చేసే మేలు మామూలుగా ఉండదట రోజు అల్లం కషాయం తీసుకుంటే ఆయా సమస్యలు తగ్గుతాయట.



శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే గుణం అల్లంలో ఉంది. కనుక అల్లం రసాన్ని రోజూ 2 టీస్పూన్ల మోతాదులో పరగడుపునే సేవించాలి.



అల్లంను రోజూ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గి హార్ట్ ఎటాక్ లు రావని పరిశోధకులు చెప్తున్నారు.



మహిళలు నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులకు చెక్ పెట్టాలంటే అల్లం రసాన్ని ఉదయాన్నే పరగడుపున సేవించాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు