న్యూయార్క్ వీధుల్లో అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డి సందడి చేశారు.

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ నిర్వహించిన ర్యాలీలో ఈ జంట పాల్గొన్నారు.

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’లో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించారు.

బన్నీతోపాటు గాయకులు శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రవాస భారతీయులు బన్నీ బన్నీ అంటూ కేరింతలు కొట్టారు.

ఈ ర్యాలీకి గ్రాండ్‌ మార్షల్‌గా పాల్గొన్న బన్నీకి అక్కడి మేయర్‌ ఆమమ్స్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ రికగ్నిషన్‌ అందించారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్‌తో కలిసి మేయర్ తగ్గేదే లే అనే డైలాగ్ చెబుతూ ఫొటోకు పోజిచ్చారు.

మరోవైపు ‘పుష్ప: ది రూల్’ షూటింగ్‌ కూడా ఆగస్టు 22 నుంచి మొదలైంది.

బన్నీ లేకుండానే సుకుమార్ అండ్ టీమ్ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.

Images & Videos Credit: Allu Arjun, Sneha Reddy/Instagram