అక్కినేని అఖిల్ సక్సెస్ కోసం చాలా పరితపించారు.
కానీ ఆయన నటించిన సినిమాలన్నీ ఏవరేజ్ గా ఆడాయి.
రీసెంట్ గా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'తో హిట్ అందుకున్నాడు.
ఇప్పుడు ఈ హిట్ ను నిలబెట్టుకునే ప్రయత్నంలో పడ్డాడు ఈ యంగ్ హీరో.
తన కొత్త సినిమా 'ఏజెంట్'తో మాస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.
దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.
ఇందులో అఖిల్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు.
దానికి తగ్గట్లే 'బీస్ట్' లుక్ లో కనిపించబోతున్నాడు.
హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఆగస్టు 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.