సక్సెస్ కోసం కసిగా ఎదురుచూస్తున్న నట వారసుడు అఖిల్ అక్కినేని. ‘ఏజెంట్’ సినిమాతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలని చూస్తున్నాడు అక్కి. అందుకే, కండలు పెంచి మరీ కష్టపడుతున్నాడు. తాజాగా మంచు కొండల్లో, ఒళ్లంతా దెబ్బలతో ఉన్న పిక్‌ను అఖిల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దెబ్బలు చూసి అభిమానులు కంగారు పడ్డారు. అవి ఫేక్ దెబ్బలని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అఖిల్ రిలాక్స్ మోడ్‌లో ఉన్నాడు. ఇటీవల అఖిల్ మల్దీవుల్లో కాసేపు చిల్ అయ్యాడు. ‘ఏజెంట్’ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేయనున్నారు. ఈ సారైనా అఖిల్‌ను విజయం వరించాలని కోరుకుందాం. Images and Videos Credit: Akhil Akkineni/Instagram