YSRTP Leaders Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ పరిస్థితి మారదా అంటూ వైఎస్సాఆర్టీపీ ఆందోళన | ABP Desam
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ దగ్గర వైఎస్సార్టిపి నాయకులు ఆందోళన చేశారు. ట్రిపుల్ ఐటిలో చదువుతున్న సంజయ్ కిరణ్ అనే విద్యార్థి మృతి ప్రభుత్వ నిర్లక్ష్యమేనంటూ మండిపడ్డారు. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని వైఎస్ఆర్టిపి ఆధ్వర్యంలో కళాశాల అధికారులకు వినతిపత్రం అందించారు. విద్యార్థి కుటుంబానికి కోటి రూపాయల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. విషపూరిత ఆహారం వల్లనే విద్యార్థి ఆరోగ్యం చెడిపోయి ప్రాణాలు వదిలాడని ఇప్పటికీ ట్రిపుల్ ఐటీ పరిస్థితి మారటం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.