YS Sharmila On KTR: మంత్రి కేటీఆర్ ప్రకటన సిగ్గుచేటు.. వైఎస్ షర్మిల ఆగ్రహం
తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యువతకు 5 శాతం ఉద్యోగాలు.. మీ కుటుంబంలో వంద శాతం ఉద్యోగాలా? అని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ వద్ద మంగళవారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనకు ఆయన సిగ్గు పడాలని ‘‘కేటీఆర్ షేమ్ ఆన్ యూ..’’ అని వ్యాఖ్యానించారు.