Govt Jobs: తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన

Continues below advertisement

తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయి, నిరుద్యోగుల సమస్యకు ఏమైనా పరిష్కారం దొరుకుతుందా అనే అంశాలపై తాజాగా క్లారిటీ వచ్చింది. తెలంగాణ అసెంబ్లీలో మల్లు భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు సమాధానమంటూ సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. 2, 3 నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభంకానుందని అసెంబ్లీలో తెలిపారు. దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు నిర్వహిస్తామన్నారు. జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన ఉంటుందన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక మొత్తంగా ఒక లక్షా యాభై ఒక వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పారు. ఇప్పటివరకూ 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని.. ఎవరికీ ఏ డిపార్ట్ మెంట్‌లో ఉద్యోగాలు వచ్చాయో అందరికీ తెలిసేలా చేస్తామన్నారు. అందుకోసం ఉద్యోగుల వివరాలను అవసరమైతే పెన్ డ్రైవ్ ద్వారా ఇస్తామని తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram