సింగూరు ప్రాజెక్టు వద్ద ప్రమాదం... సెల్ఫీ దిగుతూ నీటిలో పడిన ఇద్దరు యువకులు
సంగారెడ్డి సింగూరు ప్రాజెక్టు వద్ద ప్రమాదం జరిగింది. సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు నీటిలో పడిపోయారు. ఒకరు మృతి చెందగా మరోకరిని పర్యాటకులు తాడు సాయంతో రక్షించారు. యువకులు హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు.