Young Scientist Ashwini Drowns in Telangana Floods | వరదల్లో కొట్టుకుపోయిన యువ శాస్త్రవేత్త | ABP

Continues below advertisement

Young Scientist Ashwini Drowns in Telangana Flood |

 ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన నూనావత్ మోతిలాల్ కూతురు నూనావత్ అశ్విని ఓ యువ శాస్త్రవేత్త. చత్తీస్ ఘడ్ రాయపూర్ లో జరగనున్న జాతీయస్థాయి సైన్స్ సెమినార్ లో ప్రసంగించేందుకు ఆమెకు ఇటీవలె ఆహ్వానం అందింది. సో.. ఆ కార్యక్రమానికి వెళ్లడం కోసం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తండ్రి కూతుళ్లు ఇద్దరు కారులో బయలుదేరారు. ఐతే ఆదివారం కురిసిన వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో అదుపుతప్పి కారు వాగులో కొట్టుకు పోయింది. దీంతో తండ్రి, కూతురు ఇద్దరు మృతి చెందారు. వీరికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు.  కేటీఆర్ సైతం ట్విట్టర్ Xలో బాధను వ్యక్తం చేశారు. ఈ ఘటనతో తండాలో విషాదం నెలకొంది. అశ్విని అగ్రికల్చర్ లొ మాస్టర్ పూర్తి చేసింది. సైంటిస్ట్ గా సెలక్ట్ కావడంతో ఈ మధ్యే తండావసులు ఆమెను సన్మానం చేశారు. ఆ సందర్భంగా చదువు గొప్పతనం గురించి ఎంతో బాగా చెప్పారు...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram