Huge Floods In Warangal City | వర్షం పడితే చాలు.. ఇల్లు , వాకిలి అన్ని వదిలి రావాల్సిందేనా..! | ABP
Huge Floods In Warangal City |
మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు గ్రేటర్ వరంగల్ నగరంలోని పలుకాలనీల వాసులు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. భారీ వరదనీరు కాలనీలకు చేరుకోవడంతో హనుమకొండ వరంగల్ నగరంలోని కాలనీల్లోకి వరదనీరు చేరి నిరాశ్రయులు అయ్యారు ప్రమాదం పొంచి ఉండడంతో అధికారులు ఉన్నరావాస కేంద్రాలకు తరలించారు.శనివారం రాత్రి నుండి కురిసిన భారీ వర్షాలకు తెల్లవారే సరికి గ్రేటర్ వరంగల్ లోని పలుకాలని లు వరదనీటితో మునిగిపోయాయి. దీంతో నగరంలోని భద్రకాళి చెరువు, బొంది వాగు నాలా ను ఆనుకుని ఉన్న బృందావన్ కాలనీ, సంతోష్ నగర్, ఎన్ ఎన్ నగర్, సంతోష్ మాత కాలనీలతో పాటు ఏనుమాముల గుడిసేవాసులను పునరావాస కేంద్రాలకు తరలిచారు. నగరంలో ఏర్పాటు చేసిన ఐదు పునరావాస కేంద్రాలకు సుమారు 500 మందిని తరలించారు. మూడు రోజులుగా ఆశ్రయం పొందుతున్నారు. కట్టుబట్టలో వచ్చిన నిర్వాసితులు వర్షానికి సర్వం కోల్పోయారు. వరదనీటి ఇళ్లలో ఉన్న బియ్యం, కిరణం సామానులు, బట్టలు పూర్తిగా తడిసి పోయాయని భాదితులు వాపోయారు.విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంది. వర్షానికి ఇళ్లలోకి వచ్చి చేరిన నీటితో బుక్స్ పూర్తిగా తడిసిపోయాయని స్కూల్, కాలేజీ లకు వెళ్లే పరిస్థితి లేదని విద్యారులు వాపోయారు. ప్రతి సంవత్సరం ఇవే బాధలను వారు ఆవేదన వ్యక్తం చేశారు