Kadiyam Srihari Ministry Chances: కడియం శ్రీహరికి మంత్రి పదవి దక్కేనా?
Kadiyam Srihari Ministry Chances: కడియం శ్రీహరికి మంత్రి పదవి దక్కేనా?
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందే విస్తరణ ఉండే అవకాశం ఉంది. రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో కొన్ని జిల్లాలకు ఎక్కువ ప్రాతినిధ్యం దక్కగా, కొన్ని జిల్లాలకు అసలు చోటు లేదు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన నేతలెవ్వరూ లేరు. ఎమ్మెల్యేలు గెలవకపోవడమే దీనికి కారణం. ఈసారి ఆయా జిల్లాలకు ఛాన్స్ ఇవ్వాలని అనకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ముదిరాజ్‌లకు ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పెద్దలు. వారిలో ముక్తల్ నుంచి శ్రీహరికి రావచ్చని అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, ప్రేమసాగర్, సుదర్శన్‌రెడ్డి, మైనార్టీల నుంచి ఒకరు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచాలని రేవంత్ అనుకుంటున్నారు.
ఈ ఎన్నికలు పూర్తి చేస్తే ఇక పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి పెట్టవచ్చని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. అయితే మంత్రి పదవుల భర్తీ పెను సవాల్ గా మారనుంది. సీనియర్లు అసంతృప్తికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.