YS Sharmila: అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం: కొప్పు రాజు కుటుంబంతో షర్మిల
తెలంగాణలో నిరుద్యోగ సమస్యలపై వైఎస్ షర్మిల పోరాడుతున్న విషయం తెలిసిందే అందులో భాగంగానే ప్రతి మంగళవారం షర్మిల నిరాహార దీక్ష చేస్తున్నారు. మంగళవారం నాడు సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లో షర్మిల దీక్ష చేపట్టనున్నారు. అంతకు ముందుగా గజ్వేల్ మండలం గుండన్నపల్లి గ్రామానికి చేరుకుని కొప్పు రాజు కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. అండగా ఉంటామని, అధైర్య పడవద్దని వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చేస్తామన్నారు. ఉద్యోగం రాకపోవడంతో కొప్పు రాజు అనే యువకుడు ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు.