Puri Jagannadh: ఆ లెక్కలు తేలాల్సిందే.. పూరీ జగన్నాథ్‌పై ఈడీ ప్రశ్నల వర్షం

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ జారీ చేసిన నోటీసుల ప్రకారం టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మంగళవారం నాడు ఈడీ ఎదుట హాజరయ్యారు. డ్రగ్స్ కొనుగోలుకు లావాదేవీలు ఎలా జరిగాయనే విషయంపై దర్శకుడు పూరీని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పూరీ తర్వాత మరికొందరు తారలను కూడా ఈడీ విచారించనుంది. గత ఆరేళ్ల లావాదేవిల వివరాలు సమర్పించాలని పూరీకి అధికారులు సూచించినట్లు సమాచారం. సెప్టెంబర్ 22 వరకు 12 మంది టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈడీ ఎదుట ఒక్కొక్కరుగా హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మేరకు ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola