VC Sajjanar : కుటుంబంతో కలిసి బస్సులో ప్రయాణం... సజ్జనార్ సందడే సందడి...
Continues below advertisement
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇప్పుడు ఏంచేసినా వైరల్ అవుతుంది. ఆర్టీసీ లాభాల బాటలో నడిపించేందుకు ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ బస్టాండ్ లో యూపీఐ సేవలు, కల్లాల వద్దకే కార్గో సేవలు ఇలా సంస్కరణలతో ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సజ్జనార్... ఆర్టీసీలో ప్రయాణాన్ని ప్రమోట్ చేస్తున్నారు. మళ్లీ ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈసారి ఒక్కరే కాకుండా కుటుంబ సమేతంగా ప్రయాణించి... ఉల్లసంగా, ఉత్సాహంగా స్టెప్పులేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.
Continues below advertisement