MLA Jaggareddy : రైతు మీద మానవత్వం చూపించటం కాదు...రైతు ఓ బాధ్యత
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులను గెలిపించే బాధ్యతను తీసుకున్నాన్న ఆయన....రైతు చట్టాలవిషయంలో కేంద్రం అనుసరిస్తున్న వ్యూహాలను తప్పు పట్టారు. కేవలం రాజకీయ లబ్ది కోసం బీజేపీ వ్యవహరిస్తోంది తప్ప అన్నదాతలపై నిజంగా ప్రేమలేదన్నారు. రైతులపై మానవత్వం చూపించామంటున్న బీజేపీ నేతల మాటలను ఖండించిన జగ్గారెడ్డి రైతు ఓ బాధ్యత అన్నారు.