Nizam Surags: నిజాం షుగర్స్ కార్మికుల కన్నీటి వ్యథపై ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ..
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. కార్మకుల పాలిట కల్పవృక్షంలా ఉండేది. నిజాం షుగర్ ఫ్యాక్టరీలో పనిచేయటం అంటే అనాడు ఓ వరంలా భావించేవారు. కార్ముకులు, ఉద్యోగులకు సకల వసతులు ఉండేవి. కానీ ఫ్యాక్టరీ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. ఫ్యాక్టరీకి లే ఆఫ్ ప్రకటించటంతో కార్మికులు రోడ్డున పడ్డారు.గుండె ఆగి,అనారోగ్యంతో చనిపోయిన కార్మికులు మరికొందరు. న్యాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు.