Fake Vehicle Insurance Gang : నకిలీ వాహన భీమాపాలసీలు చేస్తున్న ముఠా అరెస్ట్

వరంగల్ లో నకిలీ వాహన భీమా పాలసీలు చేస్తున్న రెండు ముఠాలకు చెందిన 8మంది నిందితులతో పాటు అనధికారికంగా వాహన రిజిస్ట్రేషన్ మరియు లైసెన్సు కార్డులను కలిగి వున్న రోడ్డు రవాణా విభాగం కార్యకలపాలను నిర్వహించే మరో ఇద్దరు దళారీలతో పాటు మొత్తం పది మంది నిందితులను టాస్క్ ఫోర్స్, మీ కాలనీ, ఇంతేజారగంజ్ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ నిందితులందరు కుడా వాహన భీమా మరియు రోడ్డు రవాణా శాఖ దళారీలుగా వరంగల్ రోడ్డు రవాణా శాఖ కార్యాలయము పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్నారని చెప్పారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola