Schools Reopen: తెలంగాణలో మోగిన బడి గంట.. మాస్క్ తప్పనిసరి

Continues below advertisement

తెలంగాణలో పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. విద్యార్థులు నేటి ఉదయం నుంచే స్కూళ్లకు వెళుతున్నారు. తల్లిదండ్రులు కాస్త ఆందోళనతోనే చిన్నారులను పాఠశాలలకు పంపిస్తున్నారు. ఇంటి వద్ద మాట వినడం లేదని టీచర్ల పర్యవేక్షణలోనే చిన్నారులు బుద్ధిగా ఉంటారని తల్లిదండ్రులు చెబుతున్నారు. తెలంగాణ హైకోర్టులో తదుపరి విచారణ వరకు గురుకులాలను మూసివేయాలని ప్రభుత్వం తెలిపింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా మిగతా అన్ని పాఠశాలల్లోనూ ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్ విధానంలో క్లాసులు కొనసాగించాలని ఆదేశించింది. సర్కారు తాజా నిర్ణయంతో గురుకులాలు మినహా మిగతా అన్ని పాఠశాలల్లో నేటి నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. కొవిడ్19 నిబంధనల ప్రకారం మాస్కులు ధరించి విద్యార్థులకు బడికి వెళ్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram