Warangal Theft Case: SR ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ లో చోరీ | Breaking News
Continues below advertisement
వరంగల్ జిల్లా హసన్ పర్తి మండలం అన్నా సాగర్ లోని ఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్ లో దొంగతనం జరిగింది. తెల్లవారుజామున హాస్టల్ రూమ్స్ లోకి వెళ్లిన దుండగులు... విద్యార్థినుల సెల్ ఫోన్స్, ల్యాప్ టాప్స్ ఎత్తుకెళ్లారు. పారిపోతున్న దుండగుల వెనుక పోలీసులు, స్థానికులు పడ్డారు. అప్పుడు ఓ దొంగ బావిలోకి దూకేశాడు. పోలీసులు అతణ్ని పైకి లాగి అరెస్ట్ చేశారు. మొత్తం మీద ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.... వారిని హైదరాబాద్ కు చెందినవారిగా గుర్తించారు.
Continues below advertisement