Ramappa temple: ఇసుకతో పునాదులు... నీటిలో తేలియాడే ఇటుకలతో గోపురం... ఆశ్చర్యపరిచే రామప్ప నిర్మాణం

Continues below advertisement

ఇసుక పునాదిపై వెలిసిన అద్భుతం రామప్ప దేవాలయం. అపురూప శిల్పకళా తోరణాలతో అలరారుతున్న ఈ చారిత్రక కట్టడానికి ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది. మనసును గిలిగింతలు పెట్టే మదనిక రూపాలు, చూపు తిప్పుకోనివ్వని సాలభంజికలు, కాకతీయ వైభవాన్ని చాటే పేరిణి శిల్పాలు.. ఏ అప్సర కాంతలో శాపవశాన ఈ గుడి కుడ్యాలపై శిల్పాలుగా వెలిశారన్న భావన కలుగుతుంది. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ కాకతీయ కట్టడానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కింది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram