Minister Errabelli Dayakarao: హనుమకొండ జిల్లా పాలకుర్తి అధికారులతో ఎర్రబెల్లి సమావేశం| ABP Desam

వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసి 100% వ్యాక్సినేషన్ ప్రక్రియ పాలకుర్తి నియోజకవర్గంలో పూర్తిచేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కోరారు. హనుమకొండ నుండి పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం లోని ప్రభుత్వ డాక్టర్లు, వైద్య సిబ్బంది, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కరోనా బాధితులతో టెలికాన్ఫరెన్స్ ను మంత్రి నిర్వహించి కరోనా నియంత్రణకు పలు సూచనలు చేశారు. మొదటి డోసు తీసుకున్నవారికి రెండవ డోసు వ్యాక్సిన్ ఇప్పించాలని ఆయన కోరారు. అదేవిధంగా 60 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా నివారణ చర్యల్లో భాగంగా బూస్టర్ డోస్ ఇప్పించాలని ఆయన ఆదేశించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola