Khammam Green Field Highway : ఖమ్మం నుంచి దేవరపల్లి వెళ్లే గ్రీన్ ఫీల్డ్ హైవే బాధితరైతుల ఆందోళన
గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారిలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని భూ నిర్వాసిత రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఖమ్మం నుండి దేవరపల్లి వెళ్లే గ్రీన్ఫీల్డ్ హైవేలోని బాధిత రైతులు మూడున్నరేళ్లుగా పోరాడుతున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదంటున్నారు. గండగలపాడు వద్ద అలైన్మెంట్ వంకర తిరగటంలోని మిస్టరీ ఏమిటని ప్రశ్నించారు. ఇక్కడ ఒక గుడి, చెరువు, గ్రామం అడ్డం లేదని అలాంటప్పుడు హైటెన్షన్ వైర్ల లోపల, వంకరటింకర ఎలా తిరిగిందని గ్రీన్ఫీల్డ్ హైవే బాధిత రైతులు ప్రశ్నించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారి రూట్ మ్యాప్ పరిశీలనకు వచ్చిన అధికారులను బాధిత రైతులు నిలదీశారు.